Monday, December 2, 2024

మాజీ హోంమంత్రి సుచరిత వారి అనుచరుల అక్రమాలపై… గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు, ఎన్నో ఘోరాలు పాల్పడ్డారని….ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకి వినతులు

నారద వర్తమాన సమాచారం

దేశ రాజధాని ఢిల్లీలో ఎడమ చేతి బొటన వేలు నరుక్కొని నిరసన చేప్పట్టిన వైనం… గుంటూరు పట్టణంలో స్వర్ణ భారతి నగర్ కి చెందిన కోపూరి లక్ష్మీ

మాజీ హోంమంత్రి సుచరిత వారి అనుచరుల అక్రమాలపై… గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు, ఎన్నో ఘోరాలు పాల్పడ్డారని….ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకి వినతులు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్‌ మండలం స్వర్ణ భారతి నగర్‌లోని కృష్ణతులసి నగర్‌ డి బ్లాక్‌ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు.

ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద అనుచరులతో నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కుని కలకలం రేపారు.

మాజీ హోం మంత్రి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఓ ముఠా…చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేయడం, వారితో విక్రయించడం, నేరాలు చేయించడం ద్వారా వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

వీటిపై ప్రశ్నిస్తే.. అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ తమపై తప్పుడు ప్రకటనలిచ్చి అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.41వ డివిజన్‌లో భూకబ్జాలు, ప్రభుత్వాధికారుల సంతకాలను సుచరిత అనుచరులే చేస్తున్నారని తెలిపారు. ఎస్పీలు, కలెక్టర్‌లకు ఫిర్యాదులు చేసినా, వారు చర్యలకు ఆదేశించినా, కేసులు నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఏపీలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా.

మూడు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్నాను. జాతీయ మానవ హక్కుల కమిషన్‌, ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాల్లో ఆయా ఫిర్యాదులు అందించాను.

చివరిగా ఆదివారం సాయంత్రం ఎడమ చేయి బొటనవేలు నరుక్కున్నాను.

నేను చేసిన ఆయా ఆరోపణలకు అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రతి దానినీ నిరూపిస్తాను.

రాష్ట్రంలో ఈ అవినీతి, అక్రమాలు ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసమే గత్యంతరం లేక ఇలా నిరసనకు దిగాల్సి వచ్చింది..

ప్రధాని, రాష్ట్రపతి, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదులు: బాధితురాలు లక్ష్మీ


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading