నారద వర్తమాన సమాచారం
మానవ జీవితంలో ఉండే సమస్యల నుండి బయట పడటానికిస్వయంగా,విష్ణువు చెప్పిన శివ పూజావిధానం
1) #తామర పూలు, బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో శివుడ్ని శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి. శతరేకులున్న తామరపువ్వులతో (హిమాలయాల్లో ఉంటాయి) శివుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే 1 సం||లో మహదైశ్వర్య సంపన్నుడవుతాడు.
2) #తామరపూల రేకులని విడదీసి, శివ శత అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా “నమః” పలుకుతూ ఒక్కోనామానికి ఒక తామరరేకు, వేస్తూ పూజించాలి, మహాపాపాలు తొలగి, సంపదలు వస్తాయి.
3) #11 రోజులు విడిచిపెట్టకుండా, శివుడ్ని ఏ రోజుకారోజు 20 తామరపువ్వులు, వెయ్యి మారేడుదళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతిచెంది, ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు.
4) #మంచి పదవి కావాలంటే, 10 కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది, పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే, అనుకున్నపని తొందరగా ఫలిస్తుంది. కోరికలు ఉన్నంతవరకు భౌతికపూజ తప్పనిసరిగా చేయాలి.
5) #మారేడాకులను నీటిలో కడిగి 15 రోజులు శివ పూజకి వాడవచ్చు (దొరకనప్పుడు మాత్రమే), శివుడ్ని మంత్రసహితంగా, మారేడు దళాలతో, ఒక్కో దళంతో పరమశివుని పూజిస్తే, శారీరిక ఆరోగ్యం, మనఃశాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు. గురోపదేశ మంత్రంతో చేయవచ్చు, ఒక్కోనామానికి ఒక దళం వేస్తూ పూజించాలి.
6) #ధూపం వల్ల భౌతికసంపదలు పెరుగుతాయి. దీపం వల్ల జ్ఞానవృద్ధి, అర్ఘ్యం, పాద్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం, ఈ ఐదింటినీ ఈశ్వరుడికి సమర్పిస్తే, ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి. అర్చనానంతరం మృష్టాన్నభోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు
.
7) #కారాగార విముక్తికై, శివ లింగానికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి, శంఖు పూలు, బిల్వ పత్రాలు లక్ష పత్రాలకు తక్కువ కాకుండా శివుడ్ని భక్తితో అర్చిస్తే, జైలు నుంచి విముక్తి పొందుతారు.
8) #తాజా పూలతో శివుడ్ని పూజిస్తే విద్య పొందుతారు, ఆవునేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి, తేనె తో అభిషేకిస్తే, మధుర కంఠంతో సంగీతం వస్తుంది.
9) #శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే, అష్టమి, చతుర్దశి తిథులల్లో ఒక్క లక్ష బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో భక్తితో శివుడ్ని అర్చిస్తే శత్రుపీడ పొతుంది. కీర్తి కావాలంటే, సహస్ర తులసీ దళాలు పరమశివునికి సమర్పించాలి.
10) #జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జపించాలి, పరమేశ్వరుడి ముందు కదలకుండా 24 నిమిషాలు (ఎవ్వరితో మాట్లాడకుండా) శివుడిపై మనస్సుని నిలిపి ధ్యానిస్తే, ఈ జన్మలో మోక్షం కలుగుతుంది.
11) #5 లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవితపర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు, 11 రోజులు, బిల్వం పత్రాలు శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివ దర్శనం తప్పక లభ్యం అవుతుంది.🌺
12) #స్త్రీ రజస్వలయిన 5వ రోజు స్నానానంతరం శ్రీ రామాయణం, లలితా సహస్రనామములను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది. భర్త పోయిన స్త్రీ, భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే, ఏ జన్మలోను వైధవ్యం పొందదు. రాత్రి పూట పఠిస్తే భర్త వశం అవుతాడు.
13) #దర్భలతో ఈశ్వరుడ్ని శివనామాలతో అర్చిస్తే ముక్తి, ఆయుర్దాయం కోసం 2 గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి. యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజాఫలం అధికం.
14) #భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, భర్త ఉమ్మెత్తపువ్వులతో
15 రోజులు ఈశ్వరుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కల్గుతుంది. ఎర్ర కాండ ఉన్న ఉమ్మెత పువ్వులతో శివుడ్ని అర్చిస్తే, జ్ఞానబుద్ధివంతుడు యోగ్యుడైనవాడు, మాతృపితృ భక్తి కల్గిన పుత్ర సంతానం కలుగుతుంది.
15) #అవిసె(అగస్త్య) పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది, ఒక్క నెలరోజుల తులసీ దళాలతో ఈశ్వరుడిని అర్చిస్తే భుక్తి, ముక్తి లభిస్తుంది. జిల్లేడు,ఎర్ర కలువ పూలతో, ఉత్తరేణి ఈ మూడింటితో శివుడ్ని అర్చిస్తే బలపరాక్రమాలు లభిస్తాయి. ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంతతానే నశిస్తాడు. సింధూరపూలతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది.
16) #ఆయాస,ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్ర గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి. జాజి పూలతో ఈశ్వరుడ్ని పూజిస్తే వాహనసౌకర్యం, జమ్మి పత్రితో శివుడ్ని అర్చిస్తే ముక్తి లభిస్తుంది. కొండగోగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి.
17) #పురుషుడికి మంచి భార్య కావాలంటే, వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి. స్త్రీ కి మంచి భర్త కావాలంటే, మల్లె మొగ్గలతో పూజించాలి. జీవితభాగస్వామి అనుకులమైనవారు లభిస్తారు.
18) #జీవితాంతం స్వగృహప్రాప్తి భాగ్యం నిలవాలంటే, ముడి, వరి, వడ్ల ధాన్యాన్ని రెండు చేతుల గుప్పెళ్ల తో వేస్తూ ఈశ్వరుడ్ని మంత్రంతో అభిషేకించాలి. వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు (అశాంతి లేని) లభిస్తుంది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.