డాక్టర్ బాలుకు ఉత్తమ సామజికసేవా పురస్కారం..
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 23,
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి చేత ఉత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని అందజేయడం జరిగింది.తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 రక్తదాన శిబిరాల నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సంవత్సర కాలంలోనే అందజేసినందుకు ఈ పురస్కారాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,తలసేమియా సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకుడు వంశీ లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 రక్తదాన శిబిరాల నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సంవత్సర కాలంలోనే అందజేసినందుకు పురస్కారం లభించింది.ఈ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జరిగిందని అన్నారు,తలసేమియా చిన్నారులకు రక్తాన్ని అందచేసిన రక్తదాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.