
నారద వర్తమాన సమాచారం
నారా లోకేష్ ఎక్కడ?
తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య సీరియస్‌గా ఒక చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడినా నారా లోకేష్ ఎక్కడా ప్రచారంలో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ కనిపించడం లేదేంటని. అయితే ఇటీవల చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, సీఎం రమేష్ కలిసి నిర్వహించిన అంతర్గత సమావేశంలో నారా లోకేష్ కూడా పాల్గొని నోరు జారాడంట. లోకేష్ మాటలను ప్రశాంత్‌తో పాటు సీఎం రమేష్ కూడా ఖండించారు. తర్వాత బాబుకు ప్రశాంత్ ఒక సూచన చేశారు. లోకేష్ ఏపీలో జరుగుతున్న బహిరంగ సభల్లో కూడా ఇలాగే మాట్లాడతాడు కాబట్టి అతన్ని ఎన్నికల వరకు సభల్లో పాల్గొననివ్వొద్దని ప్రశాంత్ చెప్పాడు. అప్పటి నుంచి లోకేష్ ఏ సభలోనూ కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో నిర్వహించిన చిన్నచిన్న కార్యక్రమాలకు మాత్రం బాబు అనుమతి ఇచ్చారు కానీ ఆంధ్రాలో మాత్రం బహిరంగ సభల్లో పాల్గొనడానికి ఒప్పుకోవడం లేదు. టీడీపీలో నాయకత్వ లక్షణాల లేమికి నిదర్శనం ఇది.








