నారద వర్తమాన సమాచారం
నందిగామలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు
15, 16 వార్డుల్లో వైసీపీకి ఛీత్కారం
పార్టీ వీడుతున్న నేతలు – టీడీపీలోకి పెద్ద ఎత్తున కుటుంబాల చేరికలు
పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కూటమి ఉమ్మడి తంగిరాల సౌమ్య
‘టీడీపీతోనే బీసీలకు న్యాయం’ : సౌమ్య
నందిగామ పట్టణం ఏప్రిల్ 24: టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం ఉదయం నందిగామ పట్టణం 15 వ వార్డులో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతల సమక్షంలో సుమారు 30 కుటుంబాలకు పైగా వైసీపీ వీడి టిడిపి లో చేరారు. వీరిలో గోరంట్ల రామారావు, మనబోతుల వెంకట్రావు, తెప్పలి దుర్గారావు, అరబోలు లక్ష్మి, మనబోతుల అశోక్, బత్తిన రాంబాబు, బత్తిన సత్యం, నాయని లక్ష్మీనారాయణ, పాశం దుర్గారావు, ఖమ్మం వెంకట దుర్గారావు, బాయని లక్ష్మయ్య, బత్తిన రమేష్, గోరంట్ల రమేష్, గోరంట్ల వెంకట రావమ్మా, మొద్దుశెట్టి హనుమంతరావు, అరబోలు చిన్న నరసింహారావు, తెప్పలి జగదీష్, గోరంట్ల గోపి, తిప్పలి రాజేష్, గోరంట్ల శ్రీనివాస్, తోట చంద్రశేఖర్, నాయిని ఏసు, పొదిలి నరసింహారావు, పాశం దుర్గాప్రసాద్, గోరంట్ల వెంకటరావు, ఎర్రబోలు లక్ష్మి, ఎర్రబోలు నందు, తెప్పలి నరసింహారావు లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలు తమను ఆకర్షించాయనీ, గతంలో టీడీపీ అందించిన సుపరిపాలన ఇంకా మరువ లేకున్నామన్నారు. టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య విజయానికి మావంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.