నారద వర్తమాన సమాచారం
నేడు తెలంగాణకు అమిత్ షా సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ
హైదరాబాద్:ఏప్రిల్ 25
అగ్రనేత అమిత్‌షా ఇవాళ తెలంగాణలో పర్యటించను న్నారు. సిద్దిపేటలో నిర్వ హించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా ప్టర్‌లో సిద్దిపేటకు చేరు కుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు.
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్ద తుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది.
ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరు తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది.
ఇక.. పార్టీ నేతలు, కార్యక ర్తల్లో జోష్ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం…