నారద వర్తమాన సమాచారం
అమరావతి :
ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం.
ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు.
దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది.
ఎక్కడైనా, ఎవరైనా, కలెక్టరేట్ కార్యాలయం అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, విద్యుత్ శాఖ కార్యాలయం అయినా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, తహసీల్దార్ అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు 108, 104 సర్వీసులు అయినా..ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే..
14400కి ఫోన్ చేసి మీ యొక్క ఆర్జి లేఖ ఆ అధికారి పేరుతో ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు.
పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కులము, ఆదాయము, ఈ డబ్ల్యు యస్ ఇలా అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదులు చెయ్యాలని కోరారు…
ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని అదే ఆర్జి నెంబర్, లేఖ సంబంధించిన కార్యాలయంలోని సిబ్బంది వివరాలతో ఫోన్ చెయ్యండి…గిఫ్ట్ పట్టండి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.