నారద వర్తమాన సమాచారం
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫిడవిట్ పై అభ్యంతరం
నామినేషన్ ల ఘట్టం ముగిసిందని నేతలు సంతోష పడేలోపే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అఫిడవిట్ లోని లోపాలను ప్రత్యర్థులు భూతద్దం వేసి వెదుకుతున్నారు. లోపాలు ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి అఫిడవిట్పై స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్ల విలువైన ఆస్తులను నామినేషన్ లో చూపలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు.