నారద వర్తమాన సమాచారం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !
విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణపై కీలక వ్యాఖ్యలు చేసింది.
కేసు విచారణలో భాగంగా స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమంటూ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) నరసింహశర్మ చెప్పిన వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. అయితే కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100శాతం పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని ఏఎస్‌జీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. దీనితో తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 19కి వాయిదా వేస్తూ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.