
నారద వర్తమాన సమాచారం
సీతారాం ప్రాజెక్ట్ గ్రావెల్ తోలకలకు తీసుకునే పర్మిషన్ నలుసంత…
అక్రమంగా గ్రావెల్ తోలకాలు చేస్తూ.. దోచుకునేది కొండంత…
బూర్గంపాడు పలు మండలాల్లో గ్రావెల్ సిండికేట్ లో ఆ శాఖకు చెందిన అధికారి మెయిన్ పార్ట్నర్ అంటా
సుమారు100 నుంచి 500 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కి పర్మిషన్ తీసుకొని అక్రమ పద్ధతిలో వేలాది క్యూబిక్ మీటర్లు తోలుతున్న వైనం…
ప్రభుత్వానికి చెల్లించేది కొంత అక్రమ పద్ధతిలో దోచుకునేది ఎంతో…
మరి ముఖ్యంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో సీతారాం ప్రాజెక్టు గ్రావెల్ లక్షల క్యూబిక్ మీటర్లు కనిపిస్తుంది అనటంలో సందేహమే లేదట…
పై అధికారులకు ఆ అధికారి చెప్పిందే వేదం చూపించిందే నిజం…
మూడు మండలాల్లో సిండికేట్ లో ఆ అధికారి కీలకపాత్ర పోషిస్తున్నాడంట…
ఇటు సిండికేట్ కింగ్ అటు అధికారి బహుశా ఒక్క దెబ్బకు రెండు పీట్టాలంటే ఇదేనేమో…
తన శాఖకు సంబంధించిన అధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులతో సహా ఇతర శాఖల అధికారులను సైతం తన గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్న ఘనుడు..
ఇప్పటివరకు సీతారాం ప్రాజెక్ట్ గ్రావెల్ తోలకాలకు ఎంతమందికి ఎన్ని వేల క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇచ్చారు…
సీతారాం ప్రాజెక్టు గ్రావెల్ పర్మిషన్లు ప్రజల అవసరాల నిమిత్తం ఇచ్చారా లేక కొందరు బడా బాబులు స్వలాభం కోసమా…
ఆ అధికారి జీతభత్యాలు ఎంత…ఉన్న ఆస్తులు ఎంత…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.