నారద వర్తమాన సమాచారం
వైఎస్సార్సీపీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది:
హసానాబాద్ లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నంబూరు వసంత కుమారి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు సతీమణి నంబూరు వసంతకుమారి అన్నారు. క్రోసూరు మండలం హసానాబాద్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజలనుద్దేశించి వసంతకుమారి గారు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా కల్పించారన్నారు. అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. పాఠశాలలు బాగు చేసి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని శంకరరావు నెరవేర్చారన్నారు.అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నరనన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఆస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారన్నారు. ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారన్నారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని శంకరరావు అభివృద్ధి పథంలో నడిపించారని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్ గా మార్చి మీ చేతుల్లో పెడతారని చెప్పారు. సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కి, మరో ఓటు ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.