
ఉత్తమ ప్రతిభ కనబరిచిన
మెడికల్ విద్యార్థికి గోల్డ్ మెడల్ ప్రధానం.
రంగ మనీషా కు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ను ప్రధానం చేస్తున్న ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు.
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రానికి చెందిన రంగా నరేందర్ కూతురు రంగా మనీషా ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాలేజీలో టాపర్ గా నిలిచిన నేపథ్యంలో శనివారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు అజయ్ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ అవుట్ గోయింగ్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ తో పాటు సర్టిఫికెట్ ని అందించారు. ఈ సందర్భంగా మనిషాను వైద్యరంగంలో మరింత ఉన్నతి సేవలు అందించి గుర్తింపును సంపాదించుకోవాలని వారు అభినందించారు.







