నారద వర్తమాన సమాచారం
మాట ఇస్తే నెరవేర్చే నాయకుడు జగన్
కట్టమూరులో పర్యటనలో మంత్రి అంబటి
సత్తెనపల్లి
నెరవేర్చగల హామీలనే ప్రకటిస్తాడని, మాట ఇస్తే నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ,
చంద్రబాబు మాయమాటలను, ఉత్తిత్తి హామీలను నమ్మి మోసపోవద్దని అని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నియోజకవర్గ వైయస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని కట్టమూరు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంచి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఆయనఅభ్యర్థించారు . అంబటి కి గ్రామంలో ఘనస్వాగతం లభించింది. యువకులు, మహిళలు , వృద్ధులు అపూర్వరీతలో ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టారు. ఆప్యాయత కనబరిచారు. ఈ సందర్భంగా అంబటి ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఇవి భవిష్యత్తులో కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు. నియోజకవర్గంలో నన్ను , నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలన్నారు. మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాను గుర్తుకే వేసి మమ్మల్ని దీవించాలని కోరారు . స్థానికల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.