నారద వర్తమాన సమాచారం
స్వేచ్చగా ప్రజలు ఓటు వేయాలి
విజయవాడ పశ్చిమ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి
ప్రజలు నిర్బయంగా, స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని విజయవాడ పశ్చిమ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం ఓటర్లకు భరోసా కల్పించేందుకు పశ్చిమ ఇబ్రహీంపట్నంలో పారామిలటరీ బలగాలు, స్టేషన్ సిబ్బందితో కవాత్ నిర్వహించారు. ప్రతి విధి తిరిగి ఓటు హక్కు వినియోగంఫై అవగాహాన కల్పించారు. అనంతరం మీడియాతో ఏసీపీ మురళీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ విజయవాడ సీపీ, డీసీపీ ఆదేశాల మేరకు ప్రజలు స్వేచ్చగా ఓటు వేసేందుకు అవసరమైన రక్షణ కల్పిస్తామనే భరోసా కల్పించడం కోసమే కవాత్ నిర్వ హిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వహణ కోసం అని ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. రౌడీ సీటర్లఫై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను పర్యవేక్షస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్ఐ పాపారావు, పారామిలటరీ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.