నారద వర్తమాన సమాచారం
మే 5న ఇంటర్ మరియు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ మరియు ప్రోత్సహ క బహుమతులు అందించబడును
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పదవ తరగతి 500 మార్కులు ఇంటర్లో 800 మార్కులు. సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు దాతల సహకారంతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో. మే.5.2024న దరిశి పట్టణంలో దర్శి విశ్వబ్రాహ్మణ సంఘం వారి సహకారంతో మెరిట్ గల విద్యార్థులకు అభినందన సభ. ప్రోత్సహక బహుమతులు అందజేయబడును. అని సంఘ ఆధ్వర్యంలో జరిగిన సమావేశమునకు హాజరై ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నపల్లి శ్రీనివాస్ ఆచారి హాజరై మాట్లాడినారు. విద్యాభివృద్ధికి. విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఇబ్బంది కలిగినచో. జిల్లా సంఘం ఆధ్వర్యంలో వారికి తగిన సహాయ అందించుటకు సిద్ధంగా ఉన్నాము అని అన్నారు . ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి సీతారామాంజనేయులు. రాష్ట్ర కార్యదర్శి పొన్న పల్లి బ్రహ్మానందం. జిల్లా ఉపాధ్యక్షులు కిష్ట పాటి వెంకటరత్నాచారి. అద్దంకి కార్యదర్శి ఏలూరి వీర బ్రహ్మచారి. జిల్లా యువజన సంఘం అధ్యక్షులు
తు వ్వుపాటి జనార్ధనా చారి వినుకొండ మల్లికార్జున చారి. సీనియర్ నాయకులు కృష్ణమాచారి పాల్గొని ప్రసంగించారు. స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు. దొడ్డేటిపల్లి రామేశ్వర చారి. గొళ్ల పాటి శ్రీనివాసచారి. చోడ చంద్రశేఖర ఆచారి. కనితి చంద్రశేఖర ఆచారి. కంచర్ల శ్రీనివాస చారి. సత్యనారాయణ చారి. స్థానిక సంఘ నాయకులు పెద్దలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.