నారద వర్తమాన సమాచారం
క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్
ఘంటసాల కళా సమితి గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్
సుప్రసిద్ధ హార్మోనిస్ట్ సౌజన్యమూర్తి లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ 23 వా వర్ధంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు లోని షేక్ కొదావన్ కళా వేదికపై ఆయన చిత్రపటానికి ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కళా సమితి గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్ మాట్లాడుతూ స్వర్గీయ షేక్ కుదా వన్ సుప్ర సిద్ధ హార్మోనిస్టుగా అవిశ్రాంత శ్రామికునిగా 40 సంవత్సరాల పాటు వేలాది కళా ప్రదర్శనలో పాల్గొని ప్రేక్షకులను రస తరంగిణిలో ముంచెత్తి పరవశింపజేసిన కళాతపస్వి, షేక్ ఖుదా వన్ అని పేర్కొన్నారు ఎందరో నిష్ణాతులైన రంగస్థలం నటీనటులకు వాయిద్య సహకారం అందిస్తూ మరో ప్రక్క కళాకారుల ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇచ్చి వారిని సుప్రసిద్ధులుగా తీర్చిదిద్దిన నిత్య శ్రామికుడు నిరాడంబర జీవి అని శాంసన్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో లయ బ్రహ్మ కుదా వన్ కళా వేదిక సర్వాంగ సుందరంగా నిర్మింపబడింది అన్నారు ఆయన ఏప్రిల్ నెల 28వ తేదీ 2001 సంవత్సరం మరణించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళా సమితి కార్యదర్శి షేక్ మస్తాన్, భాష, షఫీ, పోతుగంటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.