నారద వర్తమాన సమాచారం
బీసీలు అంటే టిడిపి- టిడిపి అంటే బీసీలు
గత ప్రభుత్వంలో పదవులు అలంకారమే – అధికారాలు శూన్యం
రాబోయే తెదేపా ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం, గౌరవం, కార్పొరేషన్లకు నిధులు సమకూరుస్తుంది
బీసీలు తలెత్తుకునేలా రక్షణ చట్టం తీసుకురాబోతున్నాం
అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్స్ అందేలా చూస్తాం
ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్క్ ల్లో ముందు వరుసలో నిలబెడతాం
నిత్యం అందుబాటులో ఉంటాం.. ఆశీర్వదించండి
నరసరావుపేట నియోజకవర్గ వడియ రాజుల ఆత్మీయ సమావేశంలో లావు, చదలవాడ
గతాన్ని పరిశీలించుకుంటే బీసీ లంటే టిడిపి అని, టిడిపి అంటే బీసీలని… బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని.. ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని విజయ కళ్యాణమండపంలో.. నరసరావుపేట నియోజకవర్గ వడియ రాజుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు ఉన్న పదవులు అలంకారానికి మాత్రమే కానీ ఎవరికి మంచి చేయడానికి ఉపయోగపడిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. కార్పొరేషన్లు ఉన్నాయే కానీ అందులో నిధులు ఉండవు, ఏ ఒక్కరికీ రూపాయి అయినా లోన్లు ఇవ్వలేని దుస్థితి ఉందని, అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్లకు కొత్త కళ తీసుకొస్తామని అన్నారు. అధికారాలు ఇవ్వటంతో పాటుగా సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని అన్నారు. కార్పొరేషన్లకు నిధులు సమకూర్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తామన్నారు. మనం ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నామో ఆ బీజేపీ అధినేత, రేపు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక బీసీయే అని అన్నారు. సమాజంలో బీసీలు తలెత్తుకు తిరిగేలా, వారికి రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్లు వివరించారు. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. మున్సిపల్, మైన్స్ వర్కుల్లో కాంట్రాక్టులు వడియ రాజులకి ఇచ్చేలా చూస్తామన్నారు. కోటప్పకొండ వద్ద వడియ రాజులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. నిత్యం అందుబాటులో ఉంటామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, ఎంపీ, ఎమ్మెల్యేగా మమ్మల్ని ఆశీర్వదించాలని లావు, చదలవాడ పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.