నారద వర్తమాన సమాచారం
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం
జగిత్యాల జిల్లా బీర్ పూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దుబాయ్ లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ఏసీబీ డీజీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద 5000 లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బీర్పూర్ మండలంలో కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బె లేబుల్ వారెంట్(ఎన్ బి డబ్ల్యు) జారీ అయిన కేసు లో పెర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి బంధువు గంగాధర్ వద్ద 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ తిరుపతి, ఏసీబీ సిఐ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.