నారద వర్తమాన సమాచారం
పదవి విరమణ పొందుతున్న ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ సేవలను అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపియస్
సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ లను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ
పోలీసు శాఖలో చేరిన తర్వాత షుమారు 34 సంవత్సరాలు కాలం పోలీసు శాఖ లో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న యస్ కె . సలాం (ఎ ఎస్ ఐ -1545) ని మంగళవారం ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పోలీసు శాఖలో సుమారు 39 సంవత్సరాలు కాలం విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న బయ్యవరపు శంకరరావు (హెచ్ సి -868) ని ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో కుటుంబానికి దూరంగా ఉండి విధులు నిర్వహించారన్నారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఎంతో నిబద్దత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రివార్డ్ లు అందుకోవటం అభినందనీయమన్నారు. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో సేవలు అందించుటకు సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ అడ్మిన్ ఆర్ రాఘవేంద్ర ఏఆర్ అదనపు ఎస్పీ రామచంద్ర రాజు ఏ ఆర్ డిఎస్పి జి ఎం గాంధీ ఎస్బిఐ ప్రభాకర్ , ఏవో రామారావు , ఎమ్ టి ఆర్ఐ కృష్ణ ,వెల్ఫేర్ ఆర్ ఐ గోపీనాథ్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు అలాగే సన్మాన గ్రహీతలైన ఏఎస్ఐ సలాం హెడ్ కానిస్టేబుల్ బయ్యవరపు శంకరరావు మరియు వారి కుటుంబ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.