నారద వర్తమాన సమాచారం
రిక్షా కార్మికులు, సోది చెప్పేవారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు కృషి చేస్తా.
రిక్షా తొక్కి, తంబూర వాయించిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ .
ప్రపంచీకరణ నేపథ్యంలో కాలంతో పాటు రిక్షా కార్మికులు, సోది చెప్పే వారి నైపుణ్యం మెరుగు పరుచుకోపోవటంతో వారి ఆదాయం తగ్గి ఇబ్బంది పడుతున్నారని వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తమ వంతుగా కృషి చేస్తానని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధులల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాలంతో పోటీ పడుతూ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరాలని ప్రజలు రిక్షా నుంచి ఆటో ఇతర వాహనాలు ఆశ్రయిస్తుండడంతో రిక్షాకు ఆదరణ తగ్గిపోయింది అన్నారు. దింతో వారికి రోజువారి కూలి కూడా రాకపోవటంతో కుటుంభం గడవటమే కష్టంగా ఉందని పేర్కొన్నారు. అలాంటి వారికి పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్, నేను అండగా ఉంటూ సబ్సిడీ రూపంలో ఆటోలు అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు వలన తంబూరతో ఇంటింటికి తిరుగుతూ సోది చెప్పే వారి జీవం ప్రమాణం కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారని. రిక్షా కార్మికులు, సోది చెప్పేవారిని కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారే గాని వారిని ఆదుకోవడం లేదని చెప్పారు. మేము వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అనంతరం ఆయన రిక్షా తొక్కి సోది చెప్పే తంబురాను వాయించటం చూపర్లను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి వెంకట్రావు కొరబండి రాబర్ట్ దాసరి వెంకటేశ్వర్లు, దుగ్గి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.