నారద వర్తమాన సమాచారం
ఈ ఎన్నికలు అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవ పోరాటం: ప్రత్తిపాటి వెంకటకుమారి
సంకురాత్రిపాడులో ప్రత్తిపాటి సతీమణి వెంకటకుమారి, కుమారుడు శరత్ ప్రచారం
ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి, ఆయన తనయుడు శరత్. ఒక్క చిలకలూరిపేటలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు వారిద్దరు. పొరపాటునో, గ్రహపాటునో మళ్లీ కనీస స్థానాలు దక్కినా వారి దోపిడీ, అక్రమాలు, అరాచకాలకు దాన్నో లైసెన్స్‌గా భావించి వైకాపా మూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి, శరత్ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. తెలుగుదేశం అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటకుమారి మాట్లాడుతూ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఐదేళ్లుగా విధ్వంసకర పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. అది జరిగితేనే మరింత సంక్షే మం, మరింత అభివృద్ధి అందించే ప్రజాపాలనకు బాటలు పడతాయన్నారామె. మహిళలకు సూపర్‌సిక్స్ పథకాలతో కలిగే మేలుతో పాటు 50 ఏళ్లే పింఛను, అది కూడా నెల రూ. 4వేలు ఇంటికే అందుతున్నాయన్నారు. అది జరగాలంటే ప్రతి ఇంట్లో రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపైనే వేసి ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి శరత్ రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాలు, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కేసినో విష సంస్కృతులో యుతవ జీవితాల్ని, భవిష్యత్‌ను నాశనం చేసిన బ్లూ బ్యాచ్‌ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దన్నారు. చిలకలూరిపేట నుంచి తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావును, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించుకుంటే తిరిగి అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.