నారద వర్తమాన సమాచారం
జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత
- కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు
- కేసు నమోదు…సీజ్ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత
- నగదు పట్టుకున్న విషయాలపై మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి
- జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ సర్కిల్ లో మంగళవారం ఉదయం టూటౌన్ సి.ఐ క్రాంతికుమార్, ఎస్సై రుష్యేంద్ర బాబు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇంఛార్జి భీమలింగేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు
- అటు వైపుగా వచ్చిన ఫార్చునర్ వాహనాన్ని వాహనాల తనిఖీ పోలీసులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. అందులో రెండు బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1,99,97,500/- నగదును పోలీసులు సీజ్ చేశారు
- ఫార్చునర్ వాహనం రికార్డులను పరిశీలించగా…సదరు వాహనం కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్నట్లు తేలింది.
- డ్రైవర్ వెల్లడించిన అంశాలను ఆధారంగా చేసుకుని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు
- సీజ్ చేసిన నగదు రూ. 1,99,97,250/- నగదును తదుపరి చర్యల నిమిత్తం అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టూటౌన్ పోలీసులు అప్పగించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.