


నారద వర్తమాన సమాచారం
ఈరోజు క్రోసూరు, నరసరావుపేట, దాచేపల్లి, వినుకొండలలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగ తో కలిసి ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు , అయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు
పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికే మాదిగలు తమ మద్దతుని తెలియజేశారు. ఎస్సీ లను పట్టించుకోకుండా, ఎస్సీ వర్గీకరణకు ఏమాత్రం మద్దతు ఇవ్వని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదరణ ఉండదని, వైసీపీని ఓడించడమే సందేశంగా జనంలోకి వెళ్తామని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు నినదించారు. ఈసారి కూటమికే మద్దతుని తెలిపాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల భవిష్యత్ తరాల బాగు కోసమే కూటమికి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ మాదిగ తెలిపారు.
ఈ సందర్బంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ..
- బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని అన్నారు.
- ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రతి ఏటా కేటాయించి వారిపైనే పూర్తిగా ఖర్చు చేస్తామని అన్నారు.
- అంబేద్కర్ స్టడీ సర్కిల్ను పునః ప్రారంభిస్తామన్నారు.
- ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందేలా చూస్తామన్నారు.
- బ్యాక్లాగ్ నియామకాలు జరిగేలా చూస్తామన్నారు.
- ఆదర్శ గ్రామ యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామన్నారు.
- ఉచిత విద్యుత్ పథకాన్ని దళితులకు మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.
- దళితులకు లబ్ధి చేకూరేలా మా ప్రతి అడుగు ఉంటుందని వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







