నారద వర్తమాన సమాచారం
గంజాయి బ్యాచ్ నుండి మచిలీపట్నం రక్షించండి….రాష్ట్ర డిజిపి కి మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ ఫిర్యాదు …
దేశంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న మచిలీపట్నం నేడు గంజాయి బ్యాచ్ అ సాంఘిక శక్తులతో భయపడుతుందని,తక్షణమే గంజాయి బ్యాచ్ ని ఉక్కు పాదంతో అణిచివేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ఆఫ్ పోలీస్ మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ గురువారం ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రాన్ని పంపారు.మచిలీపట్నంలో లంకిశెట్టి బాలాజీ వీలేకరులు తో మాటలాడుతూ గత రెండు నెలలుగా మచిలీపట్టం పరిసర ప్రాంతాలలో గంజాయి తో యువత అనేక కేసుల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసు రికార్డులు తెలియజేస్తాయని బాలాజీ పేర్కొన్నారు. గంజాయి బ్యాచ్ జిల్లా మచిలిపట్నం ప్రభుత్వాసుపత్రిలోనూ నవీన్ మటన్ కాలనీ లోను మాచవరం లో సేడిస్ట్ వలె ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.రాత్రి వేళల్లో మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి వస్తున్న ప్రయాణికులను గంజాయి బ్యాచ్ అడ్డుకుని చిరు దోపిడీలు కు పాల్పడుతున్నారని బాలాజీ పేర్కొన్నారు.ఇటీవల మాచవరంలో గంజాయి బ్యాచ్ బడ్డీ కొట్టు పగలగొట్టి షాప్ లో ఉన్న సామాన్లు దోచి వేయటం స్థానికులు అరెస్ట్ చేసి మీడియా కూడా తెలియపరిచిన విషయాన్ని బాలాజీ పేరుకున్నారు. గంజాయి వంటి మారకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు విచారణ చేయుటకు మచిలీపట్నంలో జిల్లా జడ్జి హోదా గలని,ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరు ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో నేరం నియంత్రణలో పూర్తి వైఫల్యం చెందిందని బాలాజీ పేర్కొన్నారు.గంజాయి బ్యాచ్ని ఇటీవల మచిలీపట్నం ఆర్ పేట మహిళా ఎస్సై పట్టుకోవడం మిగిలిన ముద్దాయిలు పారిపోవటం కూడా జరిగిందని బాలాజీ తెలిపారు. ప్రస్తుతసమయంలో రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం చాప కింద నీరు లాగా గంజాయిని అందిస్తూ యువతను పక్కదారులు పట్టించి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని బాలాజీ పేర్కొన్నారు.ఎక్సైజ్ శాఖ గంజాయి నియంత్రణపై ప్రజలు అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందని, వార్తా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చైతన్యపరిచి మచిలీపట్నంలో తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ మరియు ఇంటిలిజెన్స్ పోలీస్ వర్గాలు కూడా గంజాయి నియంత్ర పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర డిజిపి ని కృష్ణ జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ ను బాలాజీ కోరారు.గంజాయినియంత్రణ పై విద్యాసంస్ధలు తల్లి తండ్రులు వారి పిల్లలు పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.