నారద వర్తమాన సమాచారం
ముస్లిం మైనారిటీల అండగా వైఎస్ఆర్సిపి
తెదేపా నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన నెకరికల్లు ముస్లిం సోదరులు
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి అంబటి
సత్తెనపల్లి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత , ఎన్నికలవేళ తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో అంబటి విస్తృతంగా పర్యటిస్తున్న తరుణంలో తేదేపా నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు వరుస కట్టాయి. గురువారం నెకరికల్లు తెదేపా కు చెందిన ఎస్ కె ఖాదర్ భాషా, ఎస్ డి హుస్సేన్ లు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, వైయస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు వారికి స్వయంగా పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 48 నెలలుగా నియోజకవర్గంలో ముస్లిం సోదరుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశానన్నారు. రాష్ట్రంలోనూ ఈ సామాజిక వర్గానికి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలో చేరిన ఖాదర్ బాషా , హుస్సేన్ లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ స్థానిక నేతలతో కలిసి కలిసి సమన్వయం చేసుకొని అంబటి గెలుపుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ ములో నెకరికల్లు మండల నాయకులు , ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.