నారద వర్తమాన సమాచారం
పల్నాడు ప్రజలే మా నమ్మకం
రాష్ట్రంలో ఈసారి గాలంతా తెదేపా వైపే
గత ఐదేళ్లలో రాష్ట్రంలో సారాయి అమ్మటంపై పెట్టిన దృష్టి..సాగునీరు తేవడంపై పెట్టలేదు
టన్నుల్లో గంజాయి దొరికిందే గాని..పదుల్లో ఉద్యోగాలు రాలా
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మా అడుగులు
మేనిఫెస్టోతో ప్రజల జీవనగమనాన్ని మార్చబోతున్నాం
లావు శ్రీకృష్ణదేవరాయలు
గత ఐదు ఏళ్లలో ఛిద్రం అయింది సామాన్యుడి బ్రతుకులే : ప్రత్తిపాటిపుల్లారావు
బూతులతో ఊగిపోతున్న వైసీపీ నేతలను సాగనంపండి
నాదెండ్ల మండలం, గణపవరంలో ఎన్నికల ప్రచారం
అడుగడుగున నీరాజనాలు పట్టిన ప్రజలు
ఈసారి మా బలం బలగం పల్నాడు ప్రజలేనని, వారి సంపూర్ణ మద్దతు మాపైనే ఉందని, ఇదే మా నమ్మకం అని.. ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అతి పెద్ద గ్రామం నాదెండ్ల మండలంలోని, గణపవరం గ్రామంలోఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల అడుగడుగునా నీరాజనాల పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో సారా ఈ అమ్మటంపై పెట్టిన దృష్టి 10 శాతమైన సాగునీరు తేవటం పై పెట్టలేదని విమర్శించారు. పల్నాడుకి సారాయి తేవాలో, సాగునీరు తేవాలో.. పల్నాడు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే గోదావరి జలాలను పల్నాడులోని సాగర్ కుడి కాలువ తెచ్చే ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి
తాగు నీరు, ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో టన్నుల కొద్ది గంజాయి దొరికిందే గాని, పదుల సంఖ్యలో ఉద్యోగాలు కూడా రాలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాన్ని మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని టిడిపి నిర్ణయించిందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే మా లక్ష్యమని అన్నారు. తెదేపా మేనిఫెస్టో చూస్తే.. అన్ని వర్గాల్లో వెలుగులు నింపేలా ఉందనిఅన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు లబ్ధి చేకూరుస్తామన్నారు. ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు తోడుగా తెదేపా నిలుస్తుందని, ఎటువంటి అపోహలు నమ్మవద్దని..నాలుగు శాతం రిజర్వేషన్ మీద, ఎన్ఆర్సి పై న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 50 షాదీకాణాలు ఎంపీ నిధులతో నిర్మించబోతున్నామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ విజయంతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని నిలబెట్టాలని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని విజయాన్ని నిర్ణయించేది గణపవరం గ్రామం అని అన్నారు.
ఈ ఐదేళ్లలో చిద్రమయింది సామాన్యులే : ప్రత్తిపాటి
గడిచిన ఐదేళ్ల కాలంలో ఛిద్రం అయింది సామాన్యుడి బతుకులేనని పత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. బటన్ ఒకవైపు నుంచి నొక్కుతూ..మరోవైపు నుంచి డబ్బులు లాగేసుకున్నాడని.. ఈ జగన్ మోసపు రెడ్డిని గద్దెదించాలని అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.