నారద వర్తమాన సమాచారం
దక్షిణంలో వైసీపీ కి భారీ షాక్
ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.
దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో
మాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందిన
సుందరనేని శేషలత,
వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్,27 వ వార్డు కు చెందిన కల్లపల్లి వెంకట సీతారామరాజు (టాక్సీ రాజు) , వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ నారా అమ్మాజీ తో పాటు
వైసిపి జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, 37వ వార్డుకు చెందిన చింతపల్లి సత్యవతి తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు.
వైసీపీ సీనియర్ నాయకులు సురా జగన్ , వైసీపీ తూర్పు నియోజకవర్గ యువ నాయకులు రావడ నారాయణ, శ్రీకాంత్ తో పాటు పలువురు పార్టీ లో చేరారు.
వారందరికీ పార్టీ కండువా వేసి జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు. పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని , తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన లో చేరిన నాయకులు మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.