భర్త ఇంటి ముందు ఆందోళన
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టిన సంఘటన మండల పరిధిలోని కాప్రాయపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన నాగమణి మండల పరిధిలోని కాప్రాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నాగమణి ప్రేమించుకుని జనవరి 21న శ్రీశైలంలో వివాహం చేసుకున్నారు. జనవరి 22న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు 2 నెలలు గడువు తీసుకుని అందరి సమక్షంలో వివాహం జరిపిస్తామని సర్ది చెప్పడంతో ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. నెలలు గడుస్తున్న స్పందన లేకపోవడంతో భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన ఫలితం లేకపోవడంతో ఇంటి ముందు ఆందోళన చేస్తున్నామన్నారు. న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్పించు కూర్చుంది.