చేనేత కార్మికులను ఆదరించండి: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు వెన్ రెడ్డి సంధ్యా రాజు
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు వెన్ రెడ్డి సంధ్యా రాజు ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ప్రతినిధుల బృందం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి సారధ్యంలో ఈరోజు భూదాన్ పోచంపల్లి లోని భూదాన్ గంగోత్రి వినోబా మందిరం సందర్శించారు. ఆచార్య వినోబాభావే యొక్క చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర విషయాలను తెలుసుకున్నారు. ఆనాటి ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటోలను తిలకించారు. అదే విధంగా భూదాన్ ఉద్యమం పోచంపల్లి నుండి యే ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు వాటి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. భూదాన్ గంగోత్రి లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సందర్శించారు. చేనేత కార్మికుల ఇండ్లను సందర్శించి చేనేత బట్టల యొక్క ప్రాముఖ్యతను వారి యొక్క కష్టసుఖాలను అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరూ చేనేత బట్టలను వాడి మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, చేనేత కార్మికుల స్వాలంబన దిశగా ప్రయనిస్తూ స్వాభిమానంతో జీవించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేనేత ధరించాలని కోరారు. అంతకుముందు టూరిజం హౌస్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీబి కృష్ణారావు, వినోబా మందిరం సభ్యులు కొయ్యడ నరసింహ గౌడ్, ఎలీషా, మురళి, ట్రస్మ నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎండి అజీజ్ షరీఫ్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు డాక్టర్ ఉజ్జిని మంజుల, బొబ్బిలి సంధ్య, పోలోజు శ్రీలత, శోభారాణి, భవాని, నీరజ, మమత, పుష్ప, కీర్తన, ఝాన్సీ రాణి, జయ, నీరజ, రూప తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.