నారద వర్తమాన సమాచారం
కొనసాగుతున్న వైయస్సార్సీపీలో చేరికలు.
జనసేన నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాదాసు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావులు
సత్తెనపల్లి
నియోజవర్గములో జనసేన పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన న్యాయవాది, జనసేన నాయకులు మాదాసు వెంకటేశ్వర్లు, మాదాసు శ్రీనివాసరావులు వైయస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గ కార్యాలయంలో వీరికి రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామాలలో కీలకమైన నాయకులు వైయస్సార్ సీపీలో చేరటం శుభ పరిణామం అన్నారు. నియోజవర్గములో గత 58 నెలలుగా ధర్మం గా నడుచుకున్నామని ,మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అంబటి కోరారు. పార్టీలో చేరిన వారు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాజుపాలెం, సత్తెనపల్లి మండల కేంద్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.