నారద వర్తమాన సమాచారం
నేడు దర్శికి చంద్రబాబు
టీడీపీ కూటమి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మీ మరియు స్థానిక నేతలతో కలసి అధినేత పర్యటన విజయవంతం చేసే దిశగా సమావేశమైన తెలుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే ప్రజాగళం సభలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేసిన మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు.
రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈసారి తమ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజాగళం పేరుతో… మరోసారి వైసీపీకి అధికారమిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు ప్రజాగళం సభల పేరిట గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు మంచి స్పందన వస్తుండటంతో పాటు పార్టీ క్యాడర్ లోనూ ఉత్సాహం నెలకొంది. ఈరోజు దర్శి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.