

నారద వర్తమాన సమాచారం
మన భూములు లాక్కునే చట్టాన్ని చెత్త బుట్టలో పడేయండి
కూటమి గెలుపు తథ్యం అంటున్న ప్రతి గ్రామ ప్రజలు
ఘన స్వాగతం పలికిన త్రిపురాపురం మరియు బాలాజీ నగర్ తండా గ్రామ కార్యకర్తలు ప్రజలు నాయకులు
ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వెయ్యాలని సాగిన ప్రచారం
నకరికల్లు మండలం త్రిపురాపురం మరియు బాలాజీ నగర్ తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ
త్రిపురాపురం మరియు బాలాజీ నగర్ తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా అభ్యర్థించారు
ఈ సందర్భంగా కన్నా గ మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు*
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చేరిగిన మాజీ మంత్రి కన్నా… జగన్ విధ్వంస పాలన దెబ్బకి. వందల కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి. వేల ఉద్యోగాలు దూరమై యువత నిరాశ నిస్పృహల్లో ఉంది. ఉద్యోగుల కల్పనలు దేశంలోనే ఏపీ 30 వ స్థానంలో ఉంది. వ్యవస్థలను కలుషితం చేస్తున్న వైసీపీ రౌడీ సంస్కృతిని ఊరు అవతల పారవేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైసీపీ వినాశకర పాలన నుంచి విముక్తి ఎప్పుడెప్పుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల నరకం సంక్షోభం సమస్యలకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ సైకో జగన్ పాలన ముగిసిపోనుంది దళిత మైనారిటీ బిసి పలు కార్పొరేషన్లని మోసం చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా స్వయంగా చేస్తున్న ముఖ్యమంత్రి చరిత్రలో ఇతను ఒక్కడే. త్వరలోనే చరమ గీతం పాడుతాం అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి వెళ్ళింది మళ్లీ తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే. కూటమి ప్రభుత్వం రావాలి. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడుగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.