

నారద వర్తమిన సమాచారం
నరసరావుపేటలో వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తున్న డా.చదలవాడ అరవింద బాబు
మీట్ అండ్ గ్రీట్ పేరుతో నియోజకవర్గ ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలు
ప్రజా సేవలో అంకితమయ్యే అవకాశం కల్పించాలంటూ ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా.చదలవాడ అరవింద బాబు వినూత్న పద్దతులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.నియోజకవర్గంలో ప్రముఖులు,ప్రభావ శీలురైన వారిని మీట్ అండ్ గ్రీట్ పేరుతో ప్రత్యేకంగా కలిసి నరసరావుపేటలో తన గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు.పట్టణంలోని చేకూరి కోటేశ్వరరావు ఆస్పత్రిలో ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.అభివృద్ధి,సంక్షేమం కొనసాగాలంటే అధికార మార్పిడి ఆవశ్యకతను వివరించారు.ప్రముఖ స్థానాల్లో ఉండే వైద్యులు,ఇతర విద్యా వంతులు ఎన్నికల్లో ప్రభావం చూపాలని కోరారు.తెలివైన వారు మౌనంగా ఉండడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదమని,ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని డా.చదలవాడ కోరారు.కార్యక్రమంలో జనసేన నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని,కపిలవాయి విజయ్,వేల్పుల సింహాద్రి యాదవ్,చేకూరి సాంబశివరావు,కొర్నేపాటి సంజీవ్ రావు,నియోజకవర్గ బిజెపి ఇంచార్జి రంగిశెట్టి రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.








