నారద వర్తమాన సమాచారం
అందరినీ పలకరిస్తూ…ఆదరించమని అభ్యర్థిస్తూ
వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు
పట్టణంలోని 28వ వార్డులో ఎన్నికల ప్రచారం
అడుగడుగున కావటికి జననీరాజనాలు
సార్వత్రిక ఎన్నికల్లోపేదల ప్రతినిధులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్న తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావటి శివనాగ మనోహర్ నాయుడు అభ్యర్థించారు. పట్టణంలోని 287వ వార్డులో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. వార్డులోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యల్ని వార్డు ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా వార్డు ప్రజలకు కలిగిన సంక్షేమ, అభివృద్ధి లబ్ది వివరాలను తెలియజేశారు. గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 600 హామీలను ఇచ్చిన ఒక్కటీ నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ 600 వాగ్ధానాలను ఆరింటికి కుదించారన్నారు. అవికూడా అమలకు సాధ్యం కానవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం, చేసేదే చెప్పే నిజాయితీగల నాయకుడు జగనన్న అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పారదర్శక పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగించాలంటే జగనన్నకు మద్దతునిచ్చి సీఎం చేయాలన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికట్లో ఫ్యాన్ గుర్తుపై తమ రెండు ఓట్లను వేసి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ను, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తనను అఖండ మెజార్జీ చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ, వార్డుకు చెందిన పలువురచు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.