

రెండో స్థానం కోసమే కాంగ్రెస్,బీ ఆర్ఎస్ పోటీ పడుతున్నాయి.
గ్రామ గ్రామాన బిజేపి కి స్వాగతం పలుకుతున్నారు
కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ బీజేపీ కి మద్దతు తెలుపుతున్నారు
కేంద్ర ప్రభుత్వ పథకాలే బీజేపీ నీ మరో సారి అధికారంలోకి తెస్తాయి
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మే05,
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం లోని కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పల్వంచ మండల కేంద్రంలోని ఆర్ ఆర్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ గెలుపు ఖాయం అయ్యింది అని రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బి ఆర్ యస్ పోటీ పడుతున్నాయి అని అన్నారు.గ్రామ గ్రామాన బిజేపి కి స్వాగతం పలుకుతున్నారనీ అన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ బీజేపీ కి మద్దతు తెలుపుతున్నారనీ అన్నారు. ఈ సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం అని కేంద్ర ప్రభుత్వ పథకాలే బీజేపీ నీ మరో సారి అధికారంలోకి తెస్తాయనీ అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.