సోమవారం జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక.
నారద వర్తమాన సమాచారం:
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మే,05
సోమవారం జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక…పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ కూ రానున్నారని.
బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసే , రోడ్ షో మరియు భారీ భహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ కు రానున్నారు.నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల నుంచి నాయకులు ,ప్రజలు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు, భారీగా హాజరు కావాలని ఆయన పిలుునిచ్చారు.
ఈ రోడ్ షో నిజామాబాద్ పాత కలెక్టరేట్ నుంచీ సాయంత్రం 5:30లకు ప్రారంభమై గాంధీ చౌరస్తా వరకు 6:30లకు చేరుకుంటుందని తెలిపారు. గాంధీ చౌరస్తా మరియు నెహ్రూ పార్క్ మధ్యలో ఉన్న కార్నర్ సమావేశం లో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారనీ పేర్కొన్నారు.
సభ అనంతరం కేసీఆర్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంట్లో భస చేస్తారని వివరించారు.మరుసటి రోజు మంగళవారం నాడు నిజామాబాద్ లో ప్రముఖులను కలసి మాట్లాడతారు. అనంతరం నిజామాబాద్ నుంచీ కామారెడ్డి కు బయలుదేరుతారు.పార్కింగ్ సౌకర్యం కొరకు. కొన్ని సూచనలు చేశారు.
ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ కార్యకర్తలు ప్రజలు.పాత కలెక్టర్ గ్రౌండ్లో .పాత కలెక్టర్ ఆఫీస్ పక్కన,3. సిపి ఆఫీస్ పక్కన.ఇరిగేషన్ ఆఫీసు స్థలం,
.ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉన్న ఆర్టీసీ స్థలాల్లో పార్కింగ్ చేయగలరు.
అలాగే బోధన్, నిజామాబాద్ అర్బన్ ప్రజలు పార్కింగ్ కొరకు
పార్కింగ్ స్థలాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించగలరని పోలీస్ కమిషనర్ కు విన్నపించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.