Thursday, December 12, 2024

గోళ్లపాడు, కుందురువారిపాలెం  గ్రామాలలోప్రచారంలో మంత్రి అంబటి.

నారద వర్తమాన సమాచారం

మేలు చేసిన వారికే మళ్లీ పట్టం కట్టండి.

కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పండి

గోళ్లపాడు, కుందురువారిపాలెం  గ్రామాలలో
ప్రచారంలో మంత్రి అంబటి.

ప్రచారంలో పాల్గొన్న నిమ్మకాయల, ఇతర ప్రజాప్రతినిధులు

ముప్పాళ్ల :

కుట్రల కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలని,ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రతి ఇంటికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టం కట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు , నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గోళ్లపాడు, కుందురువారిపాలెం గ్రామాల్లో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోళ్లపాడు లో ముందుగా ఎస్టీ కాలనీ వద్ద స్థానిక మహిళలు భారీగా ఎదురేగి స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి ,శాలువా కప్పి సత్కరించి, విజయతిలకం దిద్దారు. అనంతరం కాలనీలో ప్రధాన వీధుల్లో ప్రచారంపై పర్యటించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, ఫ్యాను గుర్తుకే ఓటు వేయమని చెప్తూ ముందుకు సాగారు. గ్రామములో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన డీజే, తీన్మార్ల డప్పుల మేళాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కుందురువారి పాలెం గ్రామంలోనూ అంబటి కి అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వేరు వేరు సమయాల్లో అంబటి మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేయడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ విప్లవాన్ని జగనన్న తీసుకు వచ్చారన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతి రూపాయి లబ్ధిదారులకే చేయడంతో పేద ప్రజల హృదయాల్లో జగనన్న సుస్థిర స్థాయిలో నిలిచిపోయారన్నారు. ఈ సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను గెలిపిద్దామని ఆయన కోరారు. ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో నియోజకవర్గంలో నన్ను ,పార్లమెంట్లో అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading