నారద వర్తమాన సమాచారం
“తిరుపతి ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం”
నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని “అగ్నిపర్వతం” బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబోవు ఎన్నికలలో ఓటు అనే వజ్రాయుధంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్ నిమ్మకాయల వీధి తీర్థకట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు!
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…
తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు,ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అభద్రతాభావంతో జీవిస్తున్నారని ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి భూ కబ్జాదారులకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు!
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజ్యమేలుతున్నదని “ల్యాండ్” “సాండ్” “శాండిల్” “లిక్కర్” మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు!
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలతో దర్జాగా ప్రజాధనాన్ని కొల్లగోడుతూ యువతరాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేశారన్నారు!
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్ను విధించే పాత పద్ధతిని తీసుకొస్తామన్నారు!
తిరుమల శ్రీవారి దర్శనం తిరుపతి స్థానికులకు అందని ద్రాక్షలా మార్చిన ఘనత అధికార పార్టీ నాయకులకే దక్కిందని శ్రీవారి సేవా టికెట్లను సినిమా టిక్కెట్ల ధరల తరహాలో ఆమాంతం పెంచేసి వెంకన్నను సామాన్య భక్తులకు స్థానికులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు!
తిరుమల శ్రీవారి దర్శనాన్ని అంగట్లో వస్తువుగా మార్చి ధరలు విపరీతంగా పెంచి దళారీల ముసుగులో అధికార పార్టీ “వైట్ కాలర్ దళారీలు” బ్లాక్ మార్కెట్లో సేవా టికెట్లను సినిమా టికెట్లు లాగా అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు!
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని విద్యుత్ ఛార్జీలు పెంచేశారని,నీటి చార్జీలు,చెత్త పై సైతం పన్ను వేసిన ఘనత గతంతో ఎన్నడూ ఎక్కడా ఏపీ ప్రజలు చూడలేదన్నారు!
తిరుమల శ్రీవారి సొమ్మును దారిదోపిఢీ దొంగల్లా దోచేస్తున్నారని తిరుమల శ్రీవారిని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులుగా శ్రీవారి భక్తులుగా మనందరిపై ఉందన్నారు!
తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాస్టర్ మైండ్ ఉపయోగించి టిడిఆర్ బాండ్ల ముసుగులో కోట్లాది రూపాయలు మెక్కేసారని భూములు కోల్పోయిన బాధితులకు,స్థానికులకు టీడిఆర్ బాండ్లు ఇవ్వకుండా వేదించారని త్వరలో టిడిఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు!
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావడం తద్యంమని తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో తిరుపతి నగర ప్రజలందరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా గెలిపించాలని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నవీన్ విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి బిజెపి నాయకురాలు కవిత, మహేష్ షణ్ముగం ప్రసన్న లోకేష్ పవన్ సుకుమార్ శరత్ గుణశేఖర్ ఆనంద్ నాగేశ్వరరావు దీన బాలాజీ విజయ్ శ్రీధర్ హరి తదితర స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.