నారద వర్తమాన సమాచారం
పల్లె గుండెల నిండా… వైసిపి జెండా.
ఊరంతా కదిలి వచ్చినట్టు..
అంబటి ప్రచారంలో జన సందోహం.
తెదేపా కంచుకోటల్లోనూ సంక్షేమఆదరణ.
నార్నెపాడు, పలుదేవర్లపాడు, లంకెలకూరపాడు గ్రామాలలో అంబటి ప్రచారం
ముప్పాళ్ల :
గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసినా, గ్లాస్ గుర్తుకు ఓటు వేసినా, ఏ పార్టీకి ఓటు వేసినా వివక్షత లేకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందించడంతో పల్లె గుండెల నిండా వైసీపీ జెండానే రెపరెపలాడుతోంది.. పారదర్శక సంక్షేమానికి జేజేలు పలుకుతోంది. ఊరు ఊరంతా కదిలి వచ్చినట్టు అంబటికి ప్రచారంలో జననీరాజనం పలుకుతోంది. తెదేపా కంచుకోటల్లోనూ వైయస్సార్సీపీకి పెరిగిన ప్రజాధరణ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నియోజకవర్గం వైయస్సార్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు ముప్పాళ్ళ మండల పరిధిలోని నార్నెపాడు ,పలుదేవర్లపాడు, లంకెల కూరపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి అంబటికి స్వాగతం పలుకారు. మహిళలు ఎదురేగి హారతులిచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీసారు.. పసి పిల్లలను సైతం చంకన ఎత్తుకొని జండాలు చేతబూని అంబటితో కలిసి ప్రచారరథం వెంట పరుగులెడుతున్నారు. ముందుగా ఆయన పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ప్రచార రథం పై పర్యటించారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోని గేమ్ చేంజర్ గా మారిందని వివరించారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదన్నారు అందుకు చంద్రబాబునాయుడు చరిత్ర కారణమన్నారు. 2014లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయని చంద్రబాబు నాయుడు మళ్లీ కొట్టాల పని అధికారం పేజి ఎక్కించుకోవాలని చూస్తున్నారన్నారు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన జగనన్న గెలిపించాలని అభ్యర్థించారు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి సత్తెనపల్లిలో నన్ను పార్లమెంట్ కి అనిల్ కుమార్ యాదవ్ను పంపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు, క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.