నారద వర్తమాన సమాచారం
మే 13 న జరిగే కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వద తప్పదు
జగన్ రెడ్డి తిరుమల పవిత్రతను మంట గలిపారు
టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ది
బాబాయిని గొడ్డలితో లేపిసిన పార్టీ, కోడికత్తి, గులక రాయి డ్రామాల పార్టీ రాష్ట్రానికి అవసరమా?
తిరుపతి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
మే 13 న జరగనున్న కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వద తప్పని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ తో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయడు మాట్లాడుతూ…తిరుపతిలో దొంగలు పడ్డారు, ఆ దొంగల్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలి. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా ఇక్కడే చదువుకున్నా. మీ అందరి ఆశీస్సులతో దేశ వ్యాప్తంగా నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నా. తిరుపతిలో గళ్లీ గళ్లీ నాకు తెలుసు, ఇవన్నీ నేను తిరిగిన రోడ్లే. 23 క్లైమోర్ బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తే..నాకు వెంకటేశ్వరస్వామి పునర్జన్మచ్చారు. ఎన్టీఆర్, చిరంజీవి ఇక్కడ నుంచే పోటీ చేశారు. సామాజిక న్యాయానికి ఎన్డీయే కూటమి కట్టుబడి బడి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో మొన్నటి వరకు టీడీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉంటే నేడు భూమణ కరుణాకర్ రెడ్డి. ఈవో ధర్మారెడ్డి, మున్సిపల్ మేయర్ పేరుకే వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు, పెత్తనం అంతా డిప్యూటీ మేయర్ దే.
టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ది
తిరుపతిలో గరుడ ప్లైవర్, చంద్రగిరి బైపాస్ నిర్మించా, తెలుగు గంగకు నీళ్లు తెచ్చాం. ఐఐటీ, ఐసర్ తెచ్చాం తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నించా. తిరుపతిలో హీరో మోటార్స్ టీ.సీ.ఎల్, కార్బన్ , డిక్సన్ వంటి కంపెనీలు తెచ్చి ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చా. దుర్మార్గుడు జగన్ వచ్చి అమర్ రాజా కంపెనీని తరిమేశాడు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలొచ్చాయా? నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకం మొగా డీఎస్సీపైనే పెడతా. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం.
జగన్ తిరుమల పవిత్రతను దెబ్బతీశారు
తిరుమల పవిత్రతను కాపాడుకునే బాధ్యత మనపై ఉంది, తిరుమతి పవిత్ర దెబ్బతీసేవారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. వైసీపీ పాలనలో 150 కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎంక్వైరీ వేసి దేవాలయాలు కూల్చిన వారిని శిక్షిస్తాం. వార్షిక ఆదాయం రూ. 50 వేలుకు పైగా ఉన్న ఆలయాల్లో అర్చకులకు రూ. 15 వేలిస్తాం. వార్షిక ఆదాయం రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న దేవాలయాల్లో రూ. 5 నుంచి 10 వేలు ఇస్తాం. పురోహితులను, వంటబ్రాహ్మణులను కులవృత్తులుగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పోరేషన్, బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీని బలోపేతం చేస్తాం. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా…తిరుపతి ఆలయం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమిస్తాం.
కోడికత్తి, గులకరాయి డ్రామాల పార్టీ రాష్ట్రానికి అవసరమా?
బీసీలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తాం. బీసీల రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఫించన్ రూ. 4 వేలకు పెంచి ఇంటి దగ్గరే అందిస్తాం. టీడీపీ మ్యానిఫెస్టో కళకళలాడుతుంటే వైసీపీ మ్యానిఫెస్టో ఎండిపోయింది. బాబాయిని గొడ్డలితో లేపిసిన పార్టీ, కోడికత్తి, గులక రాయి డ్రామాల పార్టీ రాష్ట్రానికి అవసరమా? రాష్ట్రంలో అభివృద్ది లేదు ప్రభుత్వానికి ఆదాయం లేదు. రాష్ట్రంలో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది.తిరుపతిలో సైతం గంజాయి దొరుకుతోంది. వైసీపీకి పొరపాటున ఓటేస్తే మీ ఆస్తులు మీకు దక్కవు. ల్యాంట్ టైట్లింగ్ యాక్ట్ తో మీ భూములు దోచుకుంటారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత మాది, తిరుపతి ఎంపీగా శివప్రసాద్, ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వద తప్పదని చంద్రబాబు నాయుడు అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.