నారద వర్తమాన సమాచారం
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మూడో విడత పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది..
ఈ ఓట్ల పండుగకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడత ఎన్నికలో భాగంగా 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది.
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ-అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం పోలింగ్‌ను రవాణాపరమైన అవాంతరాల కారణంగా ఆరో విడతకు వాయిదా వేశారు. ఫలితంగా మూడో విడతలో 93 లోక్‌సభ సీట్లకే పోలింగ్ జరుగుతోంది.
గుజరాత్‌లోని 25 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు, మహారాష్ట్రలోని 11 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 9 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 7 స్థానాలు, బెంగాల్‌లోని 4 స్థానాలు, గోవాలోని రెండు స్థానాలు, దాద్రా నగర్ హవేలీ, డామన్‌డయ్యులోని రెండు స్థానాలు, బిహార్లోని 5, అసోంలోని 4 స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.