

నారద వర్తమాన సమాచారం
ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు…
పెద్దపల్లి మండలంలోని మూలసాల, బొజ్జన్నపేట గ్రామాలల్లో బుధవారం రోజున మహాత్మ గాంధీ ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని బలపరుస్తూ మే 13 వ తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు గారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.