

నారద వర్తమాన సమాచారం
ఎన్ డి ఏ కూటమికి నవతరం పార్టీ మద్దత్తు,టిడిపి కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్…ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఈ నిర్ణయం -నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం
ప్రెస్ నోట్ ::07-05-2024::మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే పవన్ కళ్యాణ్ నిర్ణయం సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమికి మద్దతుగా పోటీ నుండి నవతరం పార్టీ అభ్యర్థులు తప్పుకుంటున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం 07-05-2024 మధ్యాహ్నం 1 గంటకు ప్రకటన చేశారు.
ఈ మేరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.కూటమి కి మద్దతుగా ముందుకు వచ్చిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కి నవతరం పార్టీ అభ్యర్థులకు వర్ల రామయ్య చంద్రబాబు నాయుడు తరపున కృతజ్ఞతలు తెలిపారు.సమావేశం లో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వై కిషోర్ శర్మ,గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఏండ్రెడ్డి శివారెడ్డి లను అభినందించారు. నవతరం పార్టీ షరతులు లేకుండా మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు.
రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన తల్లి పక్షవాతం వచ్చి ఇటీవల చనిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, మంత్రి విడదల రజిని కారణం అన్నారు. వైస్సార్సీపీ గూండాలు తన ఇంటిపై, కార్యాలయం పై దాడి చేసిన సమయంలో మా అమ్మ కు పక్షవాతం వచ్చిందని ఇప్పుడు రెండేళ్లు నరకం తరువాత తనతల్లి రావు చంద్రవతి మే ఒకటి చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు.అరాచకం పెచ్చుమీరిన సందర్బంగా జగన్ ప్రభుత్వం పోవాలంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి విజయం సాధించాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కి బహుమతి గా ఇస్తున్నామన్నారు. విజయవాడ, బాపట్ల, గుంటూరు, విశాఖపట్నం పార్లమెంట్, మంగళగిరి, చిలకలూరిపేట, మండపేట, రాప్తాడు, ధర్మవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కూటమి అభ్యర్థులు కోసం పని చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నవతరం పార్టీ కార్యకర్తలు ఎన్ డి ఏ అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని రావు సుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు.కార్యక్రమం లో షేక్ రజాక్, పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.







