కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి చానల్ కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: కుంభం కీర్తి రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ప్రజా రంజక పాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కీర్తి రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించిన ఉత్సాహంతోనే కేంద్రంలో కాంగ్రెస్ గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తడ్క వెంకటేశం, తడ్క రమేష్, భారత లవ్ కుమార్, గునిగంటి రమేష్, పాక మల్లేశం, సామ మధుసూదన్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.