నారద వర్తమానసమాచారం
మీ ఓటు మీ బిడ్డల భవిష్యత్తు నిర్ణయిస్తుంది
ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటు గుర్తుకే ఓటేసి మద్దతివ్వండి
మనం వేసే ఓటు ఐదేళ్లు అన్నం పెట్టేలా ఉండాలి.. ఒక్క రోజు బిర్యాని పెట్టేలా కాదు
జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపు
పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ అధికార, ప్రతిపక్ష నాయకుల ప్రలోభాలు,వత్తిడిలు పెరిగాయని ఓటర్లు వాటికి గురికాకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్థానికుడినైన నన్ను ఆదరించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మనం వేసే ఓటు మన బిడ్డల భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఓటు కు నోట్లు తీసుకోకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాకు మద్దతిచ్చి ఈవీఎం బ్యాలెట్ నెంబర్ అరులో కోటు గుర్తుకు నీతి, నిజాయితీగా ఓటు వేయాలని కోరారు. ఓటును మీరు నోటుకు అమ్ముకుంటే ఇదేళ్లలో మీరు రోజుకు ఎంతకు అమ్ముడు పోతున్నారో తెలుసా ఈక్రింది విధంగా వివరిస్తాను ఒకసారి ఆలోచించండని ఆయన సూచించారు.
ఒక సంవత్సరానికి 365 రోజులు ఐదు సంవత్సరాలకు 1825 రోజులు ఓటుకు నాయకులు ఇచ్చేది రోజు వారిగా లెక్కిద్దాం.
మీ ఓటను రూ.500 లకు అమ్ముకుంటే 1825 రోజులకు గాను రోజుకు రూ.0.27 పైసలకు అమ్ముకునట్లే అన్నారు.
అదేవిధంగా రూ.1000 లకు అయితే 1825 రోజులకు గాను రోజుకు రూ.0.56 పైసలకు అమ్ముడుపోయినట్లే అని చెప్పారు.
రూ.1500 లకు అయితే 1825 రోజులకు గాను రోజుకు రూ. 0.82 పైసలు అన్నారు.
రూ. 2000 లకు అయితే 1825 రోజులకు గాను రోజుకు రూ.1.10 పైసలు పేర్కొన్నారు.
రూ. 2,500 లకు అయితే1825 రోజులకు గాను రోజుకు రూ.1.37 పైసలన్నారు.
రూ.3,000 లకు 1825 రోజులకు గాను రోజుకు రూ.1.65 పైసలని అన్నారు.
రూ.4,000 లకు అయితే 1825 రోజులకు గాను రోజుకు రూ. 2.20 పైసలు
రూ.5000 లకు అయితే 1825 రోజులకు గాను రోజు కు రూ.2.74 పైసలని అయన వివరించారు. ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి సదరు నాయకులు మనకు ఇస్తున్న నగదు రోజుకు లక్కేస్తే పైసల్లోనేనని వాటికే మనం అమ్ముడు పోతున్నమని ఆయన వివరించారు. ఇప్పటికైనా ఓటర్లు తమ ఓటు విలువను తెలుసుకొని ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.