కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
మాచారెడ్డి మండలంలో బిఆర్ఎస్ ఖాళీ
మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు(సురేష్) తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరిక
కామారెడ్డి వైస్ ఎంపీపీ ఉరుదుండ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
రాజంపేట జెడ్పిటిసి హనుమండ్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లాప్రతినిధి:మే08,
మాచారెడ్డి ఉమ్మడి మండలం నుండి సర్పంచులు ఎంపీటీసీలు అన్ని గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు (సురేష్,) తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరిక,కామారెడ్డి వైస్ ఎంపీపీ ఉరుదండ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిక..
రాజంపేట జెడ్ పి టి సి హనుమాన్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక,కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మ ద్ అలీ షబ్బీర్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గతంలో కెసిఆర్ , కేటిఆర్, కాంగ్రెస్ పార్టీకి షబ్బీర్ అలి కి జెండా మోసే వాడు ఉండడు అని మాటలు మాట్లాడారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి జెండా పట్టేవాడు లేడు మాచారెడ్డి లో అహంకారపు మాటలు దేవుడు కూడా భరించడు.
కెసిఆర్ పర్యటన తర్వాత భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి.
అందరూ కష్టపడి జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గ నుండి అత్యధిక మెజార్టీ రావాలి.కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు నమ్మారు పట్టం కట్టారు.
వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ఐదు అమలు చేసాం.
కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదు
కానీ కెసిఆర్ మాటిమాటికి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడం జరుగుతుంది.
రైతులకు నష్టపరిహారం బిఆర్ఎస్ హయంలో ఎక్కడ ఇవ్వలేదు.పార్లమెంటు ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి సురేష్ శెట్కర్ ను ఎంపిగా గెలిపించండి.పంట నష్ట పరిహారం ఎన్నికలు అయ్యాక రైతులకు ఇస్తాము…
సురేష్ షెట్కర్ మాట్లాడుతూ..
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాను.బీబీ పాటిల్ తన పది సంవత్సరాల హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు .ఎన్నో నిధులు తిరిగి కేంద్రానికి వెళ్ళిపోయాయి.బిబిపాటిల్ కు తన వ్యాపారల మీద ఉన్న మోజు ప్రజల సమస్యలపై లేదు.బీబీ పాటిల్ అంటే బిజినెస్ పాటిల్ తన వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే ఎంపీగా కావాలను కుంటున్నాడు.ఇప్పుడు ప్రజల్లో ఉండేవాన్నీ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవాన్ని అభివృద్ధి చేసిన వాన్ని ఈసారి అవకాశం ఇవ్వండి మీ సమస్యలన్నీ దగ్గరుండి తీరుస్తాను అని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.