నారద వర్తమాన సమాచారం
కూటమి మేనిఫెస్టోలో నూర్ భాషా ముస్లింలకు స్థానం కల్పించడం హర్షనీయం : నూర్ భాషా సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా
పిడుగురాళ్ల పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఖాసిం సైదా మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోలో మైనార్టీ బడ్జెట్లో దూదేకుల కార్పొరేషన్ కు 100 కోట్లు కేటాయించడం, పట్ల హర్షం వ్యక్తం చేశారు, మైనార్టీ ముస్లింలకు వర్తించే పథకాలన్నీ దూదేకులకు వర్తింప చేస్తాననడం , ముస్లిం, నూర్ భాషాలను వేర్వేరుగా గుర్తించేలా జనగణన చేపడతాననడం, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి రుణాలు, దుల్హన్ స్కీమ్ ద్వారా లక్ష రూపాయలు అందించడం, ఇమామ్ కు 10000, మౌజనుకు 5000, మసీదు ల నిర్వహణ కొరకు 5000 రూపాయల కేటాయించడం ముస్లింలపై చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, నూర్భాషాల ముస్లింలఅభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు, వైసిపి పాలనలో మైనార్టీలపై దాడులు హత్యలు తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు, గత టిడిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు, ఈనెల 13న జరిగే ఎన్నికల్లో దూదేకుల నూర్ భాషా ముస్లింలందరూ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కి, గురజాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం రాష్ట్ర యూత్ సెక్రటరీ దూదేకుల సలీం, నూర్ భాషా నాయకులు దూదేకుల భాష, దూదేకుల జనతా గ్యారేజ్ సైదా, ఎస్బి టైలర్, దస్తగిరి, లారీ మెకానిక్ జానీ , రెయిన్బో టైలర్ భాష, సిలార్, కాసిం, కరిముల్లా, చంటి, మెకానిక్ వలి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.