కంపెనీల కాలుష్యము నుండి విముక్తి కావాలంటే సిపిఎం కి ఓటు వెయ్యండి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
కంపెనీల కాలుష్యం నుండి కావాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు కురపాటి రమేష్ అన్నారు. గురువారం రోజున దోతి గూడెం లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ పోచంపల్లి మండల ప్రాంత పరిధిలోని కంపెనీలు నుండి విపరీతమైన కలుషితమైన వాసన వస్తుందని, భూగర్భ జల మొత్తం కాలుష్యంతో నిండిపోయి పంట పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు గెలవకముందు ప్రజలకు కంపెనీల నుండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని అనేక మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి కూర్చోవడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా కంపెనీల కాలుష్యం గురించి నివారణ కోసం చర్యలు తీసుకోలేదని ఇప్పటికే ప్రాంతం మొత్తం సాయంత్రం సమయంలో సుమారు పది కిలోమీటర్ల వరకు దుర్వాసన వస్తుందో ఈ ప్రాంత ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నయి అన్నారు. కాలుష్యంతో వ్యవసాయ పంటలు పండే అవకాశం లేక సారవంతమైన భూమి మొత్తం దెబ్బతిని పంట దిగుబడి వచ్చే అవకాశం లేకుండా రైతాంగం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో కాలుష్యాన్ని అరికట్టడం కోసం సిపిఎం పార్టీ పోరాటం చేసిన చరిత్ర పార్టీకి ఉందని, సిపిఎం పార్టీ ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు ఆదరించి అధిక ఓట్లు వేసి పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంత అనేక సమస్యలపై ముఖ్యంగా కంపెనీల నుండి వచ్చే దుర్వాసన కాలుష్యం నుండి పై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి దాని నియంత్రణకు పార్లమెంటులో గొంతుకు అవుతారని అన్నారు. అందుకనే భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం పార్టీ ఎండి జాంగిర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పగ్గిళ్ళ లింగారెడ్డి, కార్యదర్శులకు సభ్యులు విష్ణు, మంచాల మధు, నాయకులు రమణ, శ్రీధర్, రాజశేఖర్, సత్తయ్య, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.