
నారద వర్తమాన సమాచారం
నకరికల్లు పోలీసు స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆ గ్రామాలలోని ప్రజలతో మాట్లాడిన- పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్.జి, ఐ పి ఎస్
సార్వత్రిక ఎన్నికలు -2024 దృష్ట్యా ప్రజలు ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ ఇందులో భాగంగా నకరికల్లు మండలం లోని సమస్యాత్మక గ్రామాలైన కుంకలగుంట, చేజర్ల మరియు ఇతర గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలించి పోలీసు అధికారులకు తగు సూచినలు ఇచ్చారు.అదేవిధంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడారు, ఎన్నికలలో ఎటువంటి గొడవలు పడవద్దని గొడవల వలన మీరే నష్టపోతారని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే పోలీసు వారికే సమాచారం ఇవ్వాలని తద్వారా పోలీసులు ఆ సమస్యను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో అక్కడ జరిగిన వివిధ సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువలను గురించి వివరించారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు,ప్రజలకు ఎన్నికల నియమావళి గురించి వివరించి ప్రజలు ఎన్నికల నియమావళిని ఉల్లంగిచరాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు.ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని సూచించారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 9440796184 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఎస్బిసిఐ ప్రభాకర్ , సిసి కోటేశ్వరరావు , నకరికల్లు ఎస్ఐ రాంబాబు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.