నారద వర్తమాన సమాచారం
నేను…మీవాడ్నే…నాకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి
ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటు గుర్తుకే ఓటు వేయండి
పాత్రికేయులు, న్యాయవాదులను అభ్యర్థించిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్.
స్థానికుడు…యువకుడు…విద్యావంతుడైన నేను మీవాడ్నే ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటు గుర్తుకే ఓటేసి నన్ను ఆశీర్వదించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాజుపాలెం మండలం, సత్తెనపల్లి పట్టణ పురవీధులల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. సమాజంలో దాగి ఉన్న అవినీతి నిర్మూలనతో పాటు ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ఒక పాత్రికేయుడిగా పన్నిండేళ్లు (ఈనాడు,ఈటీవీ రిపోర్టర్) మీతో కలిసి పాటుపడ్డానని పేర్కొన్నారు. అదేవిధంగా కక్షిదారులకు సత్వరమే న్యాయసహాయం అందించేందుకు సహచర న్యాయవాదిగా నా వంతుగా కృషి చేశాను అని తెలిపారు. మీ పాత్రికేయుడు, న్యాయవాది అయిన నాకు జైభీమ్ రావ్ భారత్ పార్టీ తరుపున సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చిన సంగతి మీ అందరికీ విధితమే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు స్టానికులైన పాత్రికేయులు, న్యాయవాదులకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏ పార్టీ కల్పించలేదని వారికి ఆయన చెప్పారు. మొట్టమొదటి సారిగా మీ వాడికి ఆ అవకాశం వచ్చిందని మీరంతా నాకు అండగా ఉండి అఖండ మెజార్టీతో గెలిపించి చట్టసభకు పంపించాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ మేనిఫెస్టో, విధి విధానాలు, ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరు లో కోటు గుర్తుకే ఓటేయాలంటూ కరపత్రాలను పాత్రికేయులు, న్యాయవాదులకు ఆయన పంపిణీ. చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.